సామాజిక దూరం పాటించాలి… కెనడా

లేదంటే భారి జరిమాన

social distance
social distance

కెనడా: ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. దీని బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. దీనికి ఎలాంటి మందు లేకపోవడం, కేవలం నివారణ ఒక్కటే మార్గం కావడంతో, ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇదే విధంగా కెనడాలోని అతిపెద్ద వాణిజ్య నగరమైన టొరంటో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచిస్తుంది. ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటించాలి, ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని ఆదేశించింది. కాని అక్కడి ప్రజలు ఎవరు సామాజిక దూరం పాటించకపోవడంతో జరిమానాలు విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక దూరం పాటించని వారికి ఐదువేల కెనడా డాలర్లు జరిమానగా విధించాలని నిర్ణయించారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుంటే కరోనా వ్యాప్తి చెంది, అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయని వారు వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/