వన్డే, టీ-20 టీం ఆఫ్ ది ఇయర్‌లో స్మృతి మందనకి చోటు

Smriti Mandhana
Smriti Mandhana

న్యూఢిల్లీ: టీం ఇండియా మహిళ క్రికెట్‌లో ఓపెనర్ స్మృతి మందనకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దూకుడైన బ్యాటింగ్‌తో స్మృతి ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన స్మృతి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 టీం ఆఫ్ ది ఇయర్‌లో స్మృతి చోటు దక్కించుకుంది. ఇప్పటివరకూ టీం ఇండియా తరఫున 66 టీ20లు, 51 వన్డేలు ఆడిన స్మృతి రెండు ఫార్మాట్లలో 3,476 పరుగులు సాధించింది. స్మృతితో పాటు వన్డే టీం ఆఫ్ ది ఇయర్‌లో ఝులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు చోటు దక్కగా.. టీ20ల్లో ఆల్ రౌండర్ దీప్తీ శర్మ చోటు దక్కించుకుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/