పాక్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు స్మిత్‌,వార్నర్‌ ఎంపిక…

సిడ్నీ: క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన ఉదంతం బాల్‌ ట్యాంపరింగ్‌. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో సునామీనే సృష్టించింది. ఆ జట్టు మూలస్తంభాలుగా భావించే ఇద్దరు క్రికెటర్లపై ఏడాదిపాటు నిషేధం విధించడానికి కారణమైంది. వారే స్టీవ్‌ స్మిత్‌-డేవిడ్‌ వార్నర్‌. వారిద్దరు జట్టులో లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. వారిద్దర్నీ క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నిషేధించిన తర్వాత ఆదేశ క్రికెట్‌ జట్టు ప్రదర్శన ఏ స్థాయిలో దిగజారిందో మనం చూశాం. శ్రీలంక వంటి జట్టుకు కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది ఆసీస్‌. మొన్నటి భారత పర్యటన దీనికి మినహాయింపు. భారతజట్టును స్వదేశంలో టీ20, వన్డే సిరీసుల్లో పరాజయం పాలు చేసింది. కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు…దుబా§్‌ులో పర్యటిస్తోంది. పాకిస్తాన్‌తో అయిదు వన్డేల సిరీస్‌ ఆడబోతుంది. దీనికోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ చోటు సంపాదించారు. త్వరలోనే వారు దుబా§్‌ు వెళ్లే విమానం ఎక్కబోతున్నారు. ఈనెల 22వ తేదీ ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య షార్జాలో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఆడబోతున్నారు. నిషేధ కాలం ముగియడంతో వారిద్దరూ జట్టులో పునరాగమనం చేశారు. దీనితో వచ్చే ఐపిఎల్‌లోనూ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో సభ్యుడు కాగా, స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరుపున ఆడబోతున్నాడు. భారత్‌లో ఆడటం తనకు ఇష్టమని అన్నాడు.
పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల షెడ్యూలు…

  • తొలి వన్డే మార్చి 22న షార్జాలో జరగనుంది.
  • రెండో వన్డే మార్చి 24 వ తేదీన షార్జాలో జరగనుంది.
  • మూడో వన్డే మార్చి 27వ తేదీన అబుదాబిలో జరగనుంది.
  • నాలుగో వన్డే మార్చి 29వ తేదీన దుబా§్‌ులో జరగనుంది.
  • అయిదో వన్డే మార్చి 31వ తేదీన దుబా§్‌ులో జరగనుంది.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/