కరోనా వ్యాప్తి నిరోధానికి స్మార్ట్ హెల్మెట్స్

దుబాయ్ లో పోలీసులకు ప్రభుత్వం సరఫరా

Smart helmets to identfies corona outbreaks

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితుల గుర్తింపు కోసం దుబాయ్‌లో స్మార్ట్‌ హెల్మెట్‌ లను  వినియోగిస్తున్నారు.

అత్యాధునిక  సాంకేతిక  పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెల్మెట్లను  అక్కడి పోలీసులకు, రవాణా శాఖ  ఉద్యోగులకు  ప్రభుత్వం సరఫరా చేసింది.

ఇందులో పరారుణ కాంతి కెమెరా, కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతిక పరికరాలను అమర్చారు.

దీనివల్ల  వీటిని పెట్టుకున్న  ఉద్యోగి  ముందు  నుంచి  వెళ్లే  పాదచారులు, వాహన చోదకులను హెల్మెట్‌లోని థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరం స్కాన్‌ చేస్తుంది.

వారి శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలను వారికి తెలియకుండానే గుర్తిస్తుంది. ఆ విధంగా బాధితులెవరైనా  తమ ముందు నుంచి వెళ్లినట్టయితే తక్షణం వారిని పట్టుకుని క్వారంటైన్‌ కేంద్రాలకు  తరలిస్తున్నారు.

బాధితుల నుంచి వారికి తెలియకుండానే ఇతరులకు వైరస్‌ వ్యాప్తి జరగకుండా కట్టడి చేయటానికి అక్కడి ప్రభుత్వం ఈ  పద్దతిని  అమలు చేస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/