రైల్వేల్లో ఇక నుండి ‘స్మార్ట్‌’ విండో

భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశాలు!

'Smart‌' window on railways
‘Smart‌’ window on railways


New Delhi: : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన 2021- 22 ఆర్థిక సంవ్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శుక్రవారం బడ్జెట్‌ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ దశాబ్దంలో ఇవి తొలిబడ్జెట్‌ సెషన్స్‌ కాగా,శుక్రవారం తొలి సెషన్‌. కరోనా వైరస్‌ కారణంగా నిర్మలమ్మ బడ్జెట్‌పైన వివిధ రంగా లు కోటి ఆశలతో ఉన్నాయి. కరోనా కారణంగా 2020లో రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిం చారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌ను ఈ ప్రకటనలకు కొనసాగింపు గా చూడాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రతి బడ్జెట్‌లో ప్రతి రాష్ట్రం, కోట్లాది మంది బడ్జెట్‌లో రైల్వే కేటాయిం పులపై కూడా ఆసక్తి కనబరచడం సహజం. ఈ సారి రైల్వేల్లో భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగం గా స్మార్ట్‌ విండోను తీసుకువస్తున్నారు. ఇది ప్రయాణీకులకు మరింత సౌక ర్యంగా ఉండడంతో పాటు, ప్రైవసీ ఉంటుందని భావిస్తున్నారు. తొలుత న్యూఢిల్లీ-హౌరి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో దీనిని ప్రవేశపెట్టనున్నారు.

స్మార్ట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తే రైలు బోగీ కిటికీలు, లోపల తలుపులు పారదర్శకం గా మారుతాయి. స్విచ్‌ ఆఫ్‌ చేస్తే యథావిధిగా మార్చుకోవచ్చు. ప్రయాణీ కులను అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. బయటి ప్రయా ణీకులకు కనిపించరు. ఇది వారికి ప్రైవసీని కల్పిస్తుంది. బోగీల మధ్య ఉన్న గ్లాస్‌ డోర్లను కూడా ఇదే విధంగా మార్చనున్నారు.

ఈ స్మార్ట్‌ విండో లను న్యూఢిల్లీ-హౌరా రాజధాని రైలులోని ఎసి1 కోచ్‌లో ఏర్పాటు చేయ నున్నారు. స్మార్ట్‌విండో ప్రయాణీకులను అవాంఛి లైట్‌ నుంచి కాపాడుతుం ది. కఠిన యూవీ కిరణాల నుంచి భద్రత ఇస్తుంది. ఈ కిటికీలు ప్రయాణీ కులకు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా కలిగిస్తాయి. ఇదిలా ఉండగా, ఈ బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వశాఖ ఐఆర్‌సి టిసి ఆదాయం పెంచే చర్యలు చేపట్టవచ్చునని తెలుస్తోంది.

ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ కేటరింగ్‌ విభాగం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అడుగులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా విమాన సేవల వలె రెడీ టూ ఈట్‌ మీల్స్‌ ప్రవేశ పెట్టే అవకాశ ముంది. దీనిని అమ లు చేసేందుకు హల్దీ రామ్‌, ఐటిసి, ఎండి ఆర్‌, వాగ్‌ బక్రీ, ఇతర ఆహార సంస్థలతో కలవనుందని తెలు స్తోంది. ఆ తర్వాత దీనిని ఐఆర్‌సిటిసికి అప్పగించవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/