నాజూకుగా ఉండాలంటే..

ఆరోగ్య భాగ్యం

slim beauty
slim beauty

సాధారణంగా తింటే బరువు పెరుగుతామనుకుంటాం. కానీ వీటిని తింటే తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా!

నట్స్‌ :

అన్ని రకాల నట్స్‌లోనూ వెజిటబుల్‌ ప్రొటీన్‌ శాతం ఎక్కువగా దొరుకుతుంది.

గుండెకు మేలు చేసే ఆన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌లూ, విటమిన్‌ ఇ, మెగ్నీషియం, పొటాషియం, సహజంగా మొక్కల నుంచి అందేస్టీరోల్స్‌ వంటివన్నీ లభిస్తాయి.

రోజూ గుప్పెడు నట్స్‌ని ఎంచుకోవడం వల్ల సగటున కనీసం ఐదుశాతం కొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి ఉంటుందట.

ముఖ్యంగా గంటల తరబడి కదలకుండా కూర్చునే ఉద్యోగినులు వీటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచింది.

పండ్లు, కూరగాయాలు :

వీటిల్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌లు తక్కువగా ఉంటాయి. సమతుల పోషకాలు కలిగిన ఆకుకూరలు, కాయగూరల్ని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

అప్పుడు అందం, ఆరోగ్యం కూడా, టిఫిన్‌ తిన్న తరువాతఓ పండు తినాలి. చపాతీ, అన్నం కంటే ఎక్కువగా కూరతీసుకోవడం మంచిది.

ఫలితంగా జీర్ణప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియా రేటు బాగుంటుంది. ఫలితంగా ఆరోగ్యకమైన బరువు మీ సొంతమవుతుంది.

సోయా:

సోయా ఉత్పత్తుల్లో సహజంగానే శాచురేటెడ్‌ ఫ్యాట్‌ తక్కువగా ఉంటుంది. అలానే ఇందులోని కొన్ని రకాల ప్రొటీన్‌లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని సమన్వయం చేస్తాయి.

పదిహేను గ్రాముల సోయా ఉత్పత్తులను రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కనీసం ఆరు శాతం కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది.

అంతేకాదు పాలూ, పెరుగూ తినని వారు ప్రత్యామ్నాయంగా
దీన్ని ఎంచుకోవచ్చు.

ఓట్స్‌-బారీ : ఓట్స్‌, బార్లీ రెండింటిలోనూ అధి మోతాదులో శరీరంలో కరిగే పీచు ఉంటుంది.

ఈ బీటా గ్లూకోన్‌ జెల్‌లా రూపాంతరం చెంది కొలెస్ట్రాల్‌ని పేగులు గ్రహించకుండా అడ్డుకుంటుంది.

అందుకే అదనంగా కొవ్వు పేరుకునే అవకాశం తక్కువ. త్వరగానూ బరువు తగ్గొచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/