ఖైరతాబాద్ గణేష్ మంటపం వద్ద స్వల్ప ఉద్రిక్తత
పోలీసులు రంగప్రవేశం

Hyderabad: ఖైరతాబాద్ గణేష్ మంటపం వద్ద కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ఉదయం ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వచ్చారు.
దీంతో ఖైరతాబాద్ గణేష్ మంటపం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పెద్ద సంఖ్యలో భక్తులను గణేషుడి దర్శనానికి అనుమతించబోమంటూ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు రంగప్రవేశం చేసి భజరంగ్ దళ్ సభ్యులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/