రాత్రిళ్ళు హాయిగా నిద్ర పట్టాలంటే ..

ఆరోగ్యం – అలవాట్లు

Sleep well at night
Sleep well at night
  • రాత్రివేళల్లో హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని సూచనలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే..
  • టైం ప్రకారం నిద్ర పోవటం మొదటి సూత్రం.
  • నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయం కేటాయించాలి. ఏ పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు
  • సరైన నిద్రకు ఆహార నియమం కూడ చాలా అవసరం .
  • నిద్రను చెడగొట్టే పానీయాలను కానీ, ఘన పదార్ధాలను కానీ తీసుకోకూడదు. అందువల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉండదు.
  • టీ, కాఫీ లను ఎక్కువగా తీసుకోవద్దు.
  • టీ, కాఫీ లకు బదులుగా బాదాం మిల్క్ , కర్ట్ పాలు మొదలైనవి తీసుకోవాలి.
  • గోరువెచ్చని పాలు గ్లాసుడు నిద్ర పోయే ముందు రాత్రి పూట తాగితే మంచిది.
  • పగటి వేళలో ఎక్కువ నిద్ర పోకూడదు. అందువల్ల రాత్రి నిద్ర పట్టదు.
  • నిద్ర రాదని మొరాయిస్తే మీకు నచ్చిన సంగీతం విముత్తో మీకు తెలియకుండా నిద్రలోకి జారిపోండి .
  • నిద్ర పోయేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయొద్దు.
  • పదే పదే పడక ప్రదేశం మార్చవద్దు.
  • కొత్త ప్రదేశం నిద్రకు ఇబ్బంది కల్గిస్తుంది . టాయిలెట్ అవసరాలను తీర్చుకోకుండా పడుకో కూడదని గ్రహించండి.

‘స్వస్థ’ (ఆరోగ్యం-అలవాట్లు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/