కంటినిండా నిద్ర అవసరం

సంపూర్ణ ఆరోగ్యం

కంటినిండా నిద్ర  అవసరం
Sleep

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.

ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పనిమీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు ఇలా చాలా అంశాలు నిద్రను
దెబ్బతీయొచ్చు.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు. వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవు రోజుల్లోనూ దీన్ని మానరాదు.

దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడకమీదికి చేరుకున్నాక 15నిమిషాలైనా నిద్రపట్ట కపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

కంటినిండా నిద్ర  అవసరం

తిండిపై కన్ను :

కడుపునిండుగా తిన్న వెంటనే గానీ ఆకలిగా ఉన్న ప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవా లను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికోటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముందుకొస్తుంది. గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

కంటినిండా నిద్ర  అవసరం

సన్నద్ద అలవాట్లు :

రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవ్ఞతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసు కోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/