నిద్ర కరువు అవుతోందా ?

ఆహారం, అలవాట్లు, జాగ్రత్తలు

ఒకపుడు కాస్త వయసు మీద పడ్డ వాళ్ళు సరిగా నిద్ర పట్టటంలేదనే వారు.. ఇపుడు మెనోపాజ్ దశకు చేరుకోని వాళ్లూ ఇదే మాట అంటున్నారు.. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు , ఉద్యోగినుల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది.. దీనికి నిపుణులు కొన్నిటినిపై దృష్టి పెట్టమంటున్నారు.. అవేంటంటే.

Sleep deprivation-
Sleep deprivation-

చాల మంది గృహిణుల విషయంలో ఏముంది ఇంట్లో ఉండి వండిపెట్టటమేగా అనేస్తారు.. కానీ, ఎంతో పని ఉంటుంది.. కరోనా టైం తర్వాత అది ఇంకా పెరిగింది.. ఇంటి నుంచి పనిచేసే వారైతే చిన్న విరామానికి సమయం ఉండటం లేదు.. నిజానికి బాగా అలసిపోతే నిద్రపోతామనుకుంటాం.. కానీ, ఒక్కోసారి ఇదే నిద్రలేమికి కారణమవుతుంది.. కాబట్టి , అదేపనిగా వేళకాని వేళల్లో పని చేయటాన్ని పక్కన పెట్టమంటున్నారు నిపుణులు .

వ్యాయామం అనగానే , చాలామంది ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాంగా అంటారు.. రెండూ వేరు.. .. వయసు, అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా, కొన్ని వ్యాయామాలను ఎంచుకునే చేయండి.. రోజులూ కొద్దిసేపైనా చెమట చిందించటానికి కేటాయించండి.. అయితె నిద్రకు ముందు మాత్రం చేయకండి..

Sleep deprivation

ఇపుడు ప్రధాన వ్యాపకం మొబైలే.. ఆఫీసు పని ఆంటీ కంప్యూటర్, లాప్ టాప్ .. వీటిని యెంత ఎక్కువసేపు వాడితె అంట నిద్ర దూరమవుతుంది.. వీటి నుంచి వెలువడే నీలి కాంతి మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపి కునుకు పడనీయదు.. కాబట్టి, నిద్రకు కనీసం గంట ముందైనా వీటికి దూరంగా ఉండాలి..

చక్కెరలు, టిఫిన్ ఉండే పదార్ధాలనూ రాత్రిపూట పక్కన పెట్టేయాలి.. అవి మెదడుని ఉత్తేజపరుస్తాయి.. దీంతో నిద్ర కరువు అవుతుంది.. రాత్రిళ్ళు తేలికగా జీర్ణమయ్యే వాటినే తీసుకోవాలి…

ఒత్తిడి, ఆందోళన , డిప్రెషన్ వంటివి మెదడుని ఎక్కువ సేపు పనిచేసీలా చేస్తాయి.. ఇవి ముదిరితే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. అతిగా ఆలోచించటం , అనవసర కంగారులను పక్కన పెట్టేయండి.. ధ్యానం చేయండి.. అవసరమైతే నిపుణుల సాయాన్ని కోరొచ్చు. ముందు వీటిల్లో మిమ్మల్ని నిద్రకు దూరంగా ఉంచుతున్నవేవో కనుక్కొని వాటికీ దూరంగా ఉంటే సరి. చెక్ చేసుకోండి మరి.

స్వస్థ (ఆరోగ్య సంబంధిత విషయాలు) శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/health/