చర్మసంరక్షణ

పెట్రోలియం జెల్లీతో లాభాలు..

Skin Care
Skin Care

చర్మ సంరక్షణలో భాగంగా అనేక సౌందర్య సాధనాలు వాడుతాం. అయితే పెట్రోలియం జెల్లీ రెండు మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.

మేకప్‌ తొలగించేందుకు కనుబొమ్లను అందంగా మలచుకునేందుకు. పర్‌ఫ్యూమ్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు పెట్రోలియం జెల్లీని వాడవచ్చు.

పెట్రోలియం జెల్లీ పర్‌ఫ్యూమ్‌ ప్రైమర్‌గా పనిచేస్తుంది. ఇది పర్‌ఫ్యూమ్‌ అణువ్ఞలను పట్టి ఉంచి ఎక్కువ సమయం పరిమళం నిలిచి ఉండేలా చేస్తుంది.

ప్లస్‌ పాయింట్‌ మీద కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసుకున్న తరువాత పర్‌ఫ్యూమ్‌ స్ప్రే చేసుకోవాలి.

కళ్లమీది నల్లటి వలయాలు పోవాలంటే కాటన్‌ బాల్‌ లేదా మేకప్‌ రిమూవర్‌ ప్యాడ్‌ మీద కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసి కళ్లమీద పది నిమిషాలు ఉంచాలి.

దాంతో ఐ షాడో కరిగి తొలగించడం సులభమవ్ఞతుంది. అంతేకాదు కళ్ల కింద గీతలు ఏర్పడకుండా చూస్తుంది.

కాటుక సరిపడా లేనప్పుడు పెట్రోలియం జెల్లీతో కనురెప్పలను అందంగా మార్చేవచ్చు. క్యూటిప్‌ అంత పెట్రోలియం జెల్లీ తీసుకుని కాటుక మాదిరి కనురెప్పట మీద దిద్దుకోవాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/