ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌కు ఐదు సూత్రాలు!

Nirmala Sitharaman
Nirmala Sitharaman, union finance minister


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చేనెల 5వ తేదీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఐదు సూత్రాల ప్రణాళిక కీలకంగా ఉండాలని పారిశ్రామికసంస్థలు, సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీటిలో ఆర్థిక, పారిశ్రామికరంగాలకు సంబంధించి డివిడెండ్‌ పంపిణీ పన్ను కీలకంగా ఉంది. సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ మాట్లాడుతూ మోడీప్రభుత్వం డిడిటిని ప్రస్తుతం ఉన్న 20శాతం నుంచి 10శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌(డిడిటి) ఇన్వెస్టర్లకు ఈ పన్ను భారం కాకూడదని కోరారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ డిడిటిని కేవలం డివిడెండ్‌ ఆదాయంపైనే విధించారని, స్టాక్‌, ఫండ్స్‌ ద్వారా వచ్చిన రాబడులపై విధించారని ఆయన సూచించారు.

ఇక అసోచామ్‌ అధ్యక్షుడు బికె గోయంకా మాట్లాడుతూ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మరిన్ని మినహాయింపులు, ప్రోత్సాహకాలు అందించాలన్నారు. పెట్టుబడులపై మొదటి సంవత్సరం నూరుశాతం తరుగుదలను అనుమతించాలని కోరారు. అసోచామ్‌ అధ్యక్షుడు బికె గోయంకా మాట్లాడుతూ జిఎస్‌టిపరంగా కేంద్ర ప్రభుత్వం పన్నుల రంగాన్ని మరికొంత సంస్కరించాలని సూచించారు. గోయంకా 2019 ప్రతిపాదించే బడ్జెట్‌లో జిఎస్‌టిని సరళీకృతం చేసే సవరణాలు ప్రకటించాలని అన్నారు. ద్వంద్వపన్నుల విధానంలో ఎనిమిదిశాతం 16శాతం శ్లాబ్‌లను మాత్రమే ఉంచాలని, ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబ్‌ల విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ఇక ఫిక్కీ ఆదాయపు పన్ను, కార్పొరేట్‌పన్నుపరంగా మరికొంత మినహాయింపులు ఇవ్వాలని సూచించింది.

20లక్షల ఆదాయవనరులున్న వారికి పరిమితి 30శాతంగా ఉంచాలని ఆదాయపు పన్నుతోపాటు కార్పొరేట్‌ పన్నును 25శాతానికి కుదించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌ కంపెనీలపై పన్నులభారం అధికంగా ఉందన్నారు. సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ మాట్లాడుతూ ప్రత్యక్ష పన్నులరంగంలో పన్నుశ్లాబ్‌ కేవలం 18శాతంగా మాత్రమే ఉండాలని సూచించారు. ఫిక్కీ కేంద్ర తన పన్ను ప్రతిపాదనల్లో మౌలికవనరుల రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అనేక కీలకమైన ప్రాజెక్టులు పట్టణ, ఒకమోస్తరు నగరాల్లో ఉన్నాయని, మెట్రోరైల్‌, ఎయిర్‌పోర్టులు, రోడ్డులు జాతీయ రహదారులపరంగా ఉండాలని సూచించారు.

ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భూసంస్కరణలు, ఆర్‌అండ్‌డిలో పెట్టుబడులు, పారిశ్రామిక విధానం, పర్యాటకరంగం నుంచి అధిక రాబడులతోపాటు పెట్టుబడులను ప్రోత్సహించడం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ఆకర్షణ, మూలధన లబ్ధిపన్ను వంటి వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుందని అన్నారు. సీతారామన్‌ ఈ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ప్రస్తుత నిబంధనలను మరింతగా 2014-19వరకూ సడలింపులు ఇవ్వడం జరిగిందని, ఎక్కువ ఫలితాలు సాధించేందుకు వీలుగా ఎక్కువ ఉపాధి కల్పనకు దృష్టిపెట్టాలని కోరారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/