నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ప్రొటెమ్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్‌ రాంరెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు ప్రమాణం చేయనున్నారు.

మరో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు. మరోవైపు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ స్పీకర్ మధుసూధనాచారితోపాటు బండా ప్రకాశ్‌ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/