తాలిబన్ల దాడి..ఆరుగురు మృతి

మరో ఏడుగురికి గాయాలు

తాలిబన్ల దాడి..ఆరుగురు మృతి
taliban

ఆఫ్ఘనిస్థాన్‌: ఆఫ్ఘనిస్థాన్‌ కుండుజ్‌ ప్రావిన్స్‌ రాజధానిలోని షేర్‌ఖాన్‌ ఓడరేవుకు చెందిన రేంజర్ వాహనంపై తాలిబాన్లు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు భద్రతా వర్గాలు తెలిపాయని స్థానిక మీడియా పేర్కొంది. అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆప్ఘన్‌ ప్రభుత్వం 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. కానీ 320 మంది విడుదలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. శాంతి ప్రక్రియలో భాగంగా ఇటీవల 20 మంది ఆఫ్ఘన్ భద్రతా సిబ్బందిని తాలిబన్లు విడుదల చేశారు. తమ ఖైదీలను విడుదల చేసేంత వరకు రక్తపాతం కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆప్ఘన్‌ సైనికులు, సాధారణ పౌరులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/