తెలంగాణలో ఆరు హాట్స్పాట్ కేంద్రాలు
లాక్డౌన్ మరింత కఠినం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీ లో జరిగిన మత ప్రార్ధనలు వెలుగులోకి వచ్చాక ఈ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులలో ఎక్కువగా మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే ఉండడంతొ, ఆ ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎక్కువగా ఢిల్లీ వెళ్లిన వారు ఉండే ప్రాంతాలను గుర్తించింది. అందులో ఎక్కువమంది ఉన్న ఆరు ప్రాంతాలను హాట్స్పాట్లుగా పేర్కొంది. అందులో హైదరాబాద్ పాతబస్తీ, భైంసా, నిర్మల్, నిజామాబాద్, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరిని అనుమతించడం లేదు, ఆ ప్రాంతాల వారిని కూడా బయటికి పంపడం లేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/