యూపిలో రోడ్డు ప్రమాదం, 6గురు మృతి

road accident
road accident


లక్నో: యూపిలోని సీతాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/