సస్పెండ్‌ అయిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Telangana Legislative Assembly
Telangana Legislative Assembly

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు పడింది. వారిని సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. కాగా తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా… సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగం సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుతగులుతుండడంతో స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేశారు. అడ్డు తగిలి నినాదాలు చేస్తుండడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని, వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీంతో అడ్డుతగిలిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జగ్గారెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అనసూయ, వీరయ్యలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/