ఢిల్లీలో కరోనా పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది

Situation in Delhi is well under control. CM Arvind Kejriwal sharing details. Press conference

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ రోగుల చికిత్స కోసం మొత్తం 14వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి. 5వేల పడకలు మాత్రమే నిండాయి. సుమారు 1700 మంది రోగులు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కాగా , మిగతావారంతో ఢిల్లీవాసులేనని’ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరించారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయితే ఇక్కడితో సంతృప్తి పడరాదని, కరోనా పరీక్షలు పెరగడం వల్లే కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అన్నారు. కరోనా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని నేను మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కానీ, సంతృప్తి పడడానికి అవకాశమే లేదు. 2,914 కొత్త కేసులు నమోదుకాగా 13 మరణాలు నమోదయ్యాయి. నిన్న మరణాల రేటు 0.4శాతంగా ఉంది. జూన్‌లో ప్రతిరోజూ 100 మంది మరణించేవారు’ అని కేజ్రీవాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/