కంప్యూటర్‌ ముందు కూర్చునే తీరు!

కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చుంటే ఇంట్లో ఉన్నా, ఆఫీసుల్లో చాలా మంది కూర్చోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తుంటారు. ఉన్న చోటు నుంచి కదలరు. ఇక ఇంటో అయితే లాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌, టివికే పరిమితమవుతారు. ఇలా అయితే ముందు ముందు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.

కంప్యూటర్‌ ముందు రాత్రి పగలు పనిచేయడం వల్ల కళ్లకు ఇబ్బందులు తప్పవు. కంప్యూటర్‌ నుండి వెలువడే కాంతి కంటిచూపుపై పడుతుంది. దాంతో కళ్లల్లో దురద, కళ్లు ఎర్రబారడం, కన్నీళ్లు ఇంకిపోవడం తదితర సమస్యలు బాధిస్తాయి. గంటకోసారి కంప్యూటర్‌ నుంచి చూపు పక్కకు మరల్చడం, సీటులోంచి లేచి నిలబడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొద్దిసేపు కళ్లను మూసుకుని ఉండడం వల్ల కళ్లుకు కొంతైనా విశ్రాంతి లభిస్తుంది. కంటి అద్దాలను కూడా ధరించాలి. ప్రస్తుతం 30 శాతం మంది ఊబకాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చాలా అనారోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది. తల నుంచి అరికాలి వరకు అన్ని భాగాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఆయా అవయవాలపై జరిగే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందంటున్నారు నిపుణులు. వ్యాయామం లేకపోతే ఆ భారం జీర్ణవ్యవస్థ మీద పడుతుంది. టివి చూస్తూ తింటూ ఉంటే జీర్ణం కాక తేన్పులు, గుండెలో మంట ఇరత సమస్యలు వేధిస్తాయి. రోజు కొంత వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.

ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారిలో వచ్చే సాధారణ సమస్య వెన్నునొప్పి. కంప్యూటర్‌ ముందు కూర్చునే భంగిమ, కీబోర్డ్‌ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లను భూమికి పూర్తిగా ఆనించాలి. ఇంట్లో కూడా పడక సమాంతరంగా ఉండాలి.
తలకింద పెట్టుకునే దిండు మరీ ఎత్తుగా, మరీ తక్కువగా ఉండకూడదు. లేదంటే వెన్నుపూసలోని డిస్క్‌లపై ఒత్తిడి పెరిగి నొప్పికి దారి తీస్తుంది.

హైబిపి ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకుంటే అది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణమవుతుంది. విపరీతమైన పని ఒత్తిడి వల్ల తరచూ తలనొప్పి, నిద్రలేమి వేధిస్తుంది. ఊబకాయంతో శ్వాసకోశ ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. గుకక వల్ల రక్తంలో ఆక్సిజన్‌ పడిపోతుంది. దాంతో మెదడుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎక్కువ సమయం కూర్చుంటే కాళ్ల నరాల్లో పూడిక ఏర్పడుతుంది.

రెండు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని ఉండకూడదు. కొందరయితే ఏమీ తినకుండా ఉంటారు. కొందరు అదేపనిగా టివి ముందు కూర్చుని జంక్‌ ఫుడ్‌ తింటుంటారు. ఇది ప్రమాదకరం. శారీరక వ్యాయామం లేకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయి. శరీరం బరువు పెరిగి అది మోకాళ్లపై పడుతుంది. పొట్టభాగంలో కొవ్వు పెరిగి శరీరం బరువెక్కుతుంది.

25 దాటిన తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజు కొంత సేపు నడవాలి. పరిగెత్తగలిగితే పరిగెత్తాలి.
గంటపాటు కూర్చుంటే కనీసం అయిదు నిమిషాలైన లేచి అటు ఇటు నడవాలి. కంప్యూటర్‌ ముందుకి ఒంగిపోకుండా నిటారుగా కాళ్లు భూమికి పూర్తిగా ఆనించి కూర్చోవాలి.

చాలా మంది అల్పాహారం మానేసి నేరుగా భోజనం చేస్తారు. ఇది కరెక్ట్‌ కాదు. తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. లంచ్‌, డిన్నర్‌లలో ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు ఉండేలా చూసుకోవాలి. నడక, వ్యాయామం లేదంటే ఇతర పనులు చేయటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/