మార్కెట్ల పతనానికి కారణంపై స్పందించిన నిర్మలా

కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయి

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1వ తేదీన లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వేళ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక, దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మలా సీతారామన్, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని, మీడియాతో మాట్లాడిన వేళ, మార్కెట్ భారీ పతనానికి కారణం ఏంటన్న ప్రశ్నను ఆమెను అడగా దీనిపై స్పందించిన నిర్మలమ్మ, అందరూ అవాక్కయ్యే సమాధానం ఇచ్చారు. కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయని ఆమె అన్నారు. బడ్జెట్ రోజున మార్కెట్ వర్గాలు సంతోషంగా లేకపోవడానికి కారణం వీకెండ్ మాత్రమేనని, సోమవారం నాడు మార్కెట్లు లాభాల్లో నడిచాయని ఆమె గుర్తు చేయడం గమనార్హం. వీకెంతో మూడ్ లో ఉన్న మదుపరులు తమ వాటాలను అమ్ముకున్నారని, ఇప్పుడు వారంతా నిజమైన ట్రేడింగ్ మూడ్ లో ఉన్నారని నిర్మలమ్మ వ్యాఖ్యానించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/