‘ల్యాప్‌టాప్’తో పార్లమెంట్‌కు బయల్దేరిన నిర్మాలమ్మ
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్
tablet as Union Budget goes digital
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ కేంద్ర బడ్జెట్ 2021ను మరికొద్దిసేపట్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి బడ్జెట్‌ను ల్యాప్‌టాప్‌లో పొందుపరిచారు. సాంప్రదాయకమైన బహీఖాతా పుస్తకం బదులుగా .. లోక్‌సభలో ల్యాప్‌టాప్ ద్వారా మంత్రి 2021-22 బడ్జెట్‌ను చదవి వినిపించనున్నారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మల సీతారామన్ కనిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మంత్రి సీతారామన్‌తో రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. పేపర్‌లెస్ బడ్జెట్‌గా గుర్తింపు పొందిన తాజా బడ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
కాగా రెడ్ కలర్ బ్యాగులో ట్యాబెలట్‌ను పార్లమెంట్‌కు తీసుకువెళ్లారు మంత్రి సీతారామన్. ఆ బ్యాగుపై గోల్డ్ కలర్‌తో జాతీయ చిహ్నం ఉన్నది. ఎరుపు, క్రీమ్ కలర్ చీరలో సీతారామన్.. పార్లమెంట్‌కు వెళ్లడానికి ముందు రాష్ట్రపతి భవన్ వెళ్లారు. 2019లోనూ మోడి సర్కార్ బడ్జెట్ వేళ కొత్త సాంప్రదాయాన్ని ఆరంభించారు. లెదర్ బ్రీఫ్ కేసులో తీసుకువెళ్లే బడ్జెట్ పత్రాలను.. ఆ ఏడాది ఆమె తొలిసారి బహీఖాతా పుస్తకం రూపంలో తీసుకువెళ్లారు. మోడి ప్రభుత్వం సూట్‌కేసు మోసుకేళ్లే టైపు కాదంటూ మంత్రి సీతారామన్ అన్నారు. ఎంపీలందరికీ బడ్జెట్ కాపీలు చదువుకునేందుకు.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను మంత్రి సీతారామన్ ఆవిష్కరించారు. చాలా సులువైన రీతిలో డిజిటల్ విధానాన్ని రూపొందించారు. ఆ యాప్‌లో మొత్తం 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి. వార్షిక ఆర్థిక నివేదిక, గ్రాంట్స్ డిమాండ్, ఫైనాన్స్ బిల్లు వివరాలు కూడా ఆ యాప్‌లో పొందుపరిచారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/