విధ్వేషాలు రెచ్చగొట్టేలా బిజెపి నేతల ప్రసంగాలు

ఢిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించాలి

sitaram yechury
sitaram yechury

న్యూఢిల్లీ: బిజెపి నేతలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల నుంచే దేశ రాజధానిలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలో హింస చేలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితి తీసుకురావడంతో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కర్ఫ్యూ విధించినా అల్లర్లు కొనసాగడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. ఢిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించడం మినహా మరో మార్గం లేదన్నారు. ఈ పరిస్థితి కేంద్ర హోంశాఖ సమధానం చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షానే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజలందరూ శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కృషిచేయాలని కోరారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి ప్రజలను సంయమనం పాటించాలి తాము కోరతామని ఏచూరి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/