సీతమ్మ రెండో సారి బడ్జెట్

Nirmala sitaraman

New Delhi: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్  శనివారం కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కేంద్ర  కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రశేశపెట్టడం ఇది రెండో సారి. మందగమనం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ కుదేలౌతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ దేశ భవిష్యత్ కు ఎంతో కీలకం కానున్నది. అదే సమయంలో ఈ బడ్జెట్ పై జనం భారీ అంచనాలతో ఉన్నారు. వేతన జీవులు ఆదాయపన్ను పరిమితిపెంపుపై, రైతులు తమ సంక్షేమం కోసం మరిన్న పథకాల కోసం, ఆటో రంగం జీఎస్టీ తగ్గింపుపై,  ఇలా ప్రతి రంగం బడ్జెట్ లో వెసులు బాటు, ఆర్థిక పరిపుష్టి కలిగించేలా కేటాయింపులు ఉంటాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/