ఫామ్‌హౌస్‌ వ్యవహారం… బిజెపి నేత బీఎల్ సంతోష్‌పై కేసు

ఈ నెల 26న లేదా 28న విచారణకు హాజరుకావాలని ఆదేశం

sit-files-case-against-bjp-leader-bl-santhosh

హైదరాబాద్‌ః మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారనే కేసులో బిజెపి నేత బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చి ఇచ్చిన ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయన రెండు తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు సంతోష్ వాట్సాప్, ఈమెయిల్ కు కూడా నోటీసులు పంపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/