సిరివెన్నెల లో గేయ రచయితను మొదటగా గుర్తించింది ఆయనేనట..

sirivennela-seetharama-sastry-passed-away

సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో యావత్ సంగీత ప్రపంచం మూగబోయింది. ఆయన ఇక లేరనే వార్తతో సినీ ప్రముఖులు తల్లడిల్లిపోతున్నారు. ఆయన మృతివార్తను జీర్ణించుకోలేకపోయారు. దాదాపు 3000కు పైగా పాటలు రాసిన ఆయన.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారనడంలో అతిశయోక్తి లేదు. 11 నంది అవార్డులు, ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్న సిరివెన్నెలలో టాలెంట్ ఉందని మొట్టమొదటగా గుర్తించింది ఎవరో చాలామందికి తెలియదు.

అయితే ముందుగా సిరివెన్నెల లో టాలెంట్ ను గుర్తించింది సోదరుడు చెంబోలు వెంకట రామ శాస్త్రి. ‘‘ అన్నయ్యా.. పాటలు పాడే సమయంలో కొత్త కొత్త పదాలను ఉపయోగిస్తున్నావు.. కవిత్వం కూడా బాగా రాస్తావు.. సాహిత్యం వైపు ప్రయత్నాలు ఎందుకు చెయ్యకూడదు.. ఒకసారి ఆలోచించండి’’.. అంటూ సిరివెన్నలకు సలహా ఇచ్చారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట సిరివెన్నెల. అప్పట్లో సీతారామ శాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారట. ఆయన ఎంఏ చదువుతున్న రోజుల్లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. అలా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టి తనదైన శైలిలో పాటలు రాస్తూ.. ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.