రేపు మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు

సిరివెన్నెల అంత్యక్రియలు రేపు ఫిలిం నగర్ మహాప్రస్థానం లో జరగబోతున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని కిమ్స్ హాస్పటల్ లోనే ఉంచారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులంతా హాస్పటల్ కు వెళ్లి సిరివెన్నెల ఆఖరి చూపు చూసి వస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఫైన్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహాన్ని తీసుకురానున్నారు.

సిరివెన్నెల మృతికి గల కారణాలను కిమ్స్ హాస్పటల్ వర్గం తెలియజేసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్య బృందం వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది.

మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకడంతో ఆపరేషన్‌ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్‌ శరీరమంతా సోకి చివరకు మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు.