ధనుష్ ‘సార్’ మూవీ టాక్

ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ ఈరోజు తెలుగు , తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాల బాగుందని , మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెపుతున్నారు.

సార్ పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడని , ఆయన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించిందని చెపుతున్నారు. సంయుక్త తనకున్నంత పరిధిలో బాగానే నటించిందని , సముద్రఖని కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతగా ఆకట్టుకున్నది , హైపర్ ఆది ఉన్నంత సేపు కామెడీ పండించాడని అంటున్నారు. ఇక తనికెళ్ల భరణి, సాయి కుమార్ లాంటి వాళ్ళు పాత్రలకు న్యాయం చేసారని అంటున్నారు.

ఇక కథ విషయానికి వస్తే కొత్త కథేమీ కానప్పటికీ , చెప్పిన విధానం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో చాలా వరకు వెంకీ అట్లూరి తన మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా చదువును మార్కెట్లో వ్యాపారంగా ఎలా మార్చారు అనే విషయాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలను ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రైవేట్ సెక్టార్లో పడి చదువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా దూరమైపోతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఎక్కడ కమర్షియల్ హక్కులకు పోకుండా హానెస్ట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాడని అంటున్నారు.