రఘువరన్ బిటెక్ ను క్రాస్ చేసిన సార్

ధనుష్ – సంయుక్త జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన సార్ మూవీ..మహాశివరాత్రి సందర్బంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొత్త కథేమీ కానప్పటికీ , చెప్పిన విధానం మాత్రం కొత్తగా అనిపించడం, స్క్రీన్ ప్లేలో చాలా వరకు వెంకీ అట్లూరి తన మ్యాజిక్ చూపించడం తో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చదువును మార్కెట్లో వ్యాపారంగా ఎలా మార్చారు అనే విషయాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలను ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రైవేట్ సెక్టార్లో పడి చదువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా దూరమైపోతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఎక్కడ కమర్షియల్ హక్కులకు పోకుండా హానెస్ట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాడని అంటున్నారు. టాక్ బాగుండడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

ఇదిలా ఉంటె ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా కలెక్షన్స్ మొత్తాన్ని సార్ సినిమా జెస్ట్ ఒక్క రోజులోనే క్రాస్ చేసి అందర్నీ షాక్ చేసింది. దాంతో పాటే ధనుష్ సార్ మూవీని కొన్న బయ్యలర్లకు..డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ అయిన రెండో రోజే లాభాలు తెచ్చిపెట్టేసింది. మరోపక్క సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం తో ఈ మూవీ థియేటర్ల సంఖ్యను పెంచేస్తున్నారు మేకర్స్ అండ్ డిస్ట్రీబ్యూటర్స్‌. సినిమాకు సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో.. అందర్నీ ఎమోషనల్ గా ఆకట్టుకుంటూ ఉండడంతో.. అందుకు తగ్గట్టు అన్ని ఏరియాలలో స్క్రీన్స్ ను పెంచేస్తున్నారు. సార్ సినిమాను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.