మాస్కు ధరించడంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

సింగిల్ డ్రైవింగ్ లో మాస్కు అవసరంలేదన్న కేంద్రం

Union Health Ministry Secretary Rajesh Bhushan

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించండం తప్పనిసరి అయింది. అయితే సింగిల్‌గా డ్రైవింగ్, సైక్లింగ్ లేదా వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నప్పుడు, జిమ్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం మాస్కు వేసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే పలు రాష్ట్రాల పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే కారులో సింగిల్‌గా డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఆపి మాస్కు ధరించకపోవడాన్ని ప్నశ్నిస్తూ జరిమానా విధిస్తున్నారని, ఏమైనా నిబంధన ఉన్నదా అని రాజేశ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/