డిప్యూటీ కమిషనర్ అన్నమలై రాజీనామా

కర్నాటక: బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. అన్నమలై తన పదవికి రాజీనామా చేశారు. కర్నాటక పోలీస్శాఖలోధైర్య సహసాలు ప్రదర్శించే.. నిజాయితీ గల అధికారిగా సింగంగా పిలువబడే అన్నమలై మంగళవారం రోజు హోంమంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో ఆరాష్ట్ర సిఎం హెచ్డీ కుమారస్వామిని కలిసి తన రాజీనామా విషయాన్ని తెలియజేశారు. తన నిర్ణయాన్ని సమీక్షింకుని విధుల్లో కొనసాగాల్సిందిగా సిఎం కోరినప్పటీకి అన్నమలై సున్నితంగా తిరస్కరించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతు విధి నిర్వహణలో ఇంతకాలం సహకరించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన రాజీనామా విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. విధి నిర్వహణలో ఇంతవరకు స్వేచ్ఛనే ఇచ్చారన్నారు. పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నా. ప్రజా, పౌర సేవలో సాధించాల్సిన విజయాలనే అందుకున్నాను. తర్వాత ఏం చేస్తాననే విషయం వెల్లడిస్తానికి తనకో నాలుగు నెలల సమయం అవసరమన్నారు. కాగా అన్నమలై ఆర్ఎస్ఎస్తో టచ్లో ఉన్నట్లు త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/