శబరిమలకు మహిళలు వెళ్లొద్దు

K. J. Yesudas
K. J. Yesudas

కోడంబాక్కం: మహిళలు శబరిమలకు వెళ్లొద్దని ఎంతో వినమ్రతతో కోరుకుంటన్నానని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ కోరారు. దీన్ని పాటించడం ద్వారా ఎన్నో ఎళ్లుగా సంప్రదాయంగా వస్తున్న క్షేత్రం ప్రాశస్త్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చేన్నైలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకప్పుడు అయ్యప్ప మాల వేసే భక్తులు ఇంట్లో స్త్రీలను కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది దీక్ష తీసుకున్నవారు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇది తప్పనిసరి కావచ్చు. కానీ మహిళలు నేరుగా అయ్యప్ప ఆలయానికి వెలితే భక్తుల్లో మనో చంచలానికి కారణం కావచ్చు. వారి మనసులో చెడు భావన కలగడం వలన వారి దీక్ష భగ్న కావచ్చు. అందుకే శబరిమలకు వెళ్ల వద్దని వేడుకుంటున్నానని జేసుదాసు అన్నారు. మహిళలు వెళ్లడానికి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అయ్యప్ప ఆలయం తప్ప వేరే ఏ ఆలయానికైనా వెళ్లండని మహిళలకు ఈ సందర్భంగా ఏసుదాసు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/