ప్రముఖ సింగర్ నోయెల్ ఇంట విషాద ఛాయలు

ప్రముఖ సింగర్ , నటుడు నోయెల్ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. నోయెల్ తండ్రి శ్యాముల్ సేన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఈ వార్త కాస్త లేటుగా బయటకు వచ్చింది. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన..శనివారం పరిస్థితి విషమించడం తో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి పలువురు గాయని గాయకులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆదివారం రాత్రి నోయెల్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు సన్నిహితులు నోయెల్ ఇంటికి వెళ్లి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు. నోయల్‌కి తండ్రితో మంచి అనుబంధం ఉంది. ఇప్ప‌టికీ ఆ అనుబంధం కొన‌సాగుతూనే ఉంది. త‌న సోష‌ల్ మీడియాలోనూ నోయ‌ల్ తండ్రితో ఉన్న వీడియోల‌ను షేర్ చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

సింగర్ గా నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ర్యాపర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నోయెల్ సింగర్ గానే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో నటించారు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొన్నారు.ఈ సీజ‌న్‌లో కొన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందుల‌తో నోయెల్ మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత హీరోయిన్ ఈస్ట‌ర్‌తో విడిపోయిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.