మాజీ ఎంపి కవితపై కార్మిక సంఘం నేత ఫైర్‌

Kavitha
Kavitha

కొత్తగూడెం: సింగరేణిలోని టిఆర్‌ఎస్‌ కార్మిక అనుబంధ సంఘం టిబిజికెఎస్‌కు గతంలో కవిత గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించిన విషయం విదితమే. కాగా కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మల్లయ్య నిజామాబాద్‌ మాజీ ఎంపి కవితను తీవ్రంగా విమర్శించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కవితను నమ్మిన కారణంగా తాము మనస్థాపం చెందామని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే సిగరేణి కార్మిక సంఘం స్థాపించామన్నారు. దానికి నాయకత్వం వహించిన తనను ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేశారని వాపోయారు. టిబిజికెఎస్‌లోకి చొరబడి యూనియన్‌ని ముక్కలు చేశారని మల్లయ్య ధ్వజమెత్తారు. కెసిఆర్‌లో ఉద్యమ స్పూర్తి లేదని, ఆయనకు ఆ స్పూర్తి తిరిగి పొందడం కూడా అసాధ్యమని కెంగర్ల మల్లయ్య విమర్శించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/