సింధూ బయోపిక్‌లో?

Sindhu
Sindhu

సింధూ బయోపిక్‌లో?

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే.. జాతీయస్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల జీవితం ఆధారంగా బయోపిక్‌లను తెరకెక్కించటం తాజాగా ట్రెండ్‌గా మారింది.. ఇప్పటికే ఎంఎస్‌ధోనీ, సచిన్‌, మిల్కాసింగ్‌, జీవిత చిత్రల ఆధారంగా బయోపిక్‌లు వచ్చాయి.. ప్రముఖ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు జీవితం ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే సినీ నటుడు సోనూ సూద్‌ గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈచిత్రం స్క్రిప్టులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సోన , సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడ కలిసి స్క్రిప్టు గురించి డిస్కస్‌ చేశారట.. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయినట్టు తెలుసోతంది.. ఇక ఈసినిమాలో సోనూ, మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ పాత్రలో నటించనున్నారు.. అలాగే ఈసినిమాకు నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్‌లో పివి సింధు నటిస్తున్నట్టు తెలుస్తోంది.