సుదిర్మన్‌ కప్‌ బరిలో సింధు, సైనా, శ్రీకాంత్‌

sindhu, saina, srikanth
sindhu, saina, srikanth


స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పివి సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో భారత్‌ జట్టు సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బరిలో దిగుతుంది. చైనా వేదికగా ఈ నెల 19 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంటులో పాల్గొనే భారతజట్టును భారత బ్యాడ్మింటన్‌ సంఘం మంగళవారం ప్రకటించింది.
గ్రూప్‌ డి లో భారత్‌ పోటీ పడనుంది. ఈగ్రూప్‌లో భారత్‌తో పాటు మాజీ ఛాంపియన్‌ చైనా, మలేషియాలు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 2017 సుదిర్మన్‌ కప్‌లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుని చైనా చేతిలో ఓడిపోయింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/