హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా

హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా
Sri Sri Ravi Shankar

New Delhi: అయోధ్యపై తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ తీర్పు ఇరు వర్గాలకు సంతోషం కలుగచేసిందని, ఉపశమనం కలిగించిందని అన్నారు. అయోధ్య భూ వివాదంపై కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోవాలన్న సూచనల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో రవిశంకర్ సభ్యుడిగా ఉన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com