రేపు రిజిస్టర్‌ మ్యారేజీతో ఒక్కటవనున్న జంట

సైనా, కశ్యప్‌ల పెళ్లి

– రేపు రిజిస్టర్‌ మ్యారేజీతో ఒక్కటవనున్న జంట

భారత బ్యాడ్మింటన్‌ తారలు సైనా నెహ్వాల్‌, పారుప్లి కశ్యప్‌ల జంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్‌ల గృహాలు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని ప్రముఖులందరికి సైనా, కశ్యప్‌లు అం దజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సైనా, కశ్యప్‌ల పెళ్లి చాలా సాదాసీదాగా జరుగనుంది. గురువారం కశ్యప్‌కు ఉపనయనంతో పెళ్లి తంతు మొదలవుతుంది. ఈ నెల 14న రిజిస్టర్‌ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్‌లో ఒక్కటవుతారు. ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మద్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేరోజు దక్షిణ భార త సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా కార్యక్రమం ఉంటుంది. 16న వివాహ విందు నిర్వహిస్తారు. అని బ్యాడ్మింటన్‌ వర్గాలు తెలిపాయి.