సైమా విజేతలు వీరే!

SIIMA Awards 2019
SIIMA Awards 2019

దోహా: ఖతార్ లో బుధవారం రాత్రి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (సైమా) ఎనిమిదో ఎడిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్తమ నటుడు రామచరణ్, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఉత్తమ చిత్రం మహానటిని ఎంపిక చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. సైమాకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. కాగా ర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


సైమా విజేతల వివరాలు


ఉత్తమ నటుడు: రామ్ చరణ్ (రంగ స్థలం)

ఉత్తమ నటుడు(క్రిటిక్): విజయ్ దేవర కొండ (గీతా గోవిందం)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (మహానటి)

ఉత్తమ నటి(క్రిటిక్): సమంత (రంగస్థలం)

ఉత్తమ చిత్రం: మహానటి

ఉత్తమ దర్శకుడు: సుకమార్ (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్ (మహానటి)

ఉత్తమ సహాయ నటి: అనసూయ (రంగస్థలం)

ఉత్తమ హాస్య నటుడు: సత్య (చలో)

ఉత్తమ విలన్: శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)

ఉత్తమ పాట రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే జ రంగస్థలం)
ఉత్తమ సింగర్ : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా జ ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ జ రంగస్థలం)

ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)

ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)

సోషల్ మీడియా పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/