కర్తార్ పూర్ కారిడార్ వెళ్లేందుకు సిద్ధూకు కేంద్రం అనుమతి

అనుమతులు మంజూరు చేసిన విదేశాంగశాఖ

Sidhu
Sidhu

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, భారత మాజీ క్రికెటర్‌ సిద్దూకు పాకిస్థాన్‌ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆయనకు భారత విదేశాంగశాఖ అనుమతులు జారీ చేసింది. పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన మూడో లేఖ రాశారు. తన మూడో లేఖకు కూడా స్పందించకపోతే లక్షలాది మంది సిక్కు భక్తుల మాదిరే తాను పాకిస్థాన్ వెళతానని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయనకు విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/