సిద్ధార్థ ఆకస్మిక మరణం బాధాకరం

కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చింది

ktr
ktr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కేఫ్‌ కాఫీ డే యాజమాని సిద్ధార్థ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సిద్ధార్థ ఆకస్మిక మరణం బాధాకరం. వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆయన సౌమ్యుడు, జెంటిల్‌మెన్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులు, కేఫ్‌ కాఫీ డే నిబ్బరంగా ఉండాలి అని కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/