జూలై 21 కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ!

సిఎల్పీ భేటిలో కీలక నిర్ణయం

siddharamaiah
siddharamaiah

బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాజీ సియం, కాంగ్రెస్‌ కీలక నేత సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ..జూలై 21న కేబినెట్‌ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి సహా అసమ్మతి నేతలు తిరిగొస్తారని ఈ సందర్భంగా మాజీ సియం చెప్పారు.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ముంబైకి వెళ్లిన వారంతా దయచేసి వాపసు రావాలని మీరంతా తిరిగొస్తే.. మంత్రులను చేస్తామని..మీ సమస్యలు పరిష్కరిస్తామని ఇదివరకే సిద్దరామయ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి చూస్తే కేబినెట్‌ విస్తరణలో తిరిగి పార్టీలోకి వచ్చే అసమ్మతి ఎమ్మెల్యేల్లో కొందరికి చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎంతమంది ఎమ్మెల్యేలు తిరిగొస్తారో వేచి చూడాలి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/