డికె శివకుమార్‌ అరెస్టు వెనుక సిద్ధరామయ్య హస్తం ఉంది: బిజెపి

nalin kumar
nalin kumar


బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్‌ అరెస్టుకు మాజీ సిఎం సిద్ధరామయ్యే కారణమని ఆ రాష్ట్ర బిజెపి చీఫ్‌ నళిన్‌కుమార్‌ కతీల్‌ అన్నారు. ఇటీవల బాగల్‌ కోట్‌లో పర్యటించిన నళిన్‌కుమార్‌ సిద్ధరామయ్యను టార్గెట్‌ చేశారు. డికె శివకుమార్‌ అరెస్టు వెనుక సిద్ధరామయ్య హస్తం ఉందని, పార్టీలోను, ప్రభుత్వంలోనూ శివకుమార్‌ ఎదుగుదల చూసి ఓర్వలేక ఇరికించి ఉంటారని నళిన్‌కుమార్‌ ఆరోపించారు. అంతేకాదు శివకుమార్‌ గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించడం ద్వారా ఆయన ప్రతిష్ట పెరిగే పార్టీలో తన పరపతి తగ్గుతుందనే ఉద్దేశంతో సిద్ధరామయ్య కుట్రపన్ని ఉంటారనని నళిన్‌కుమార్‌ అన్నారు. ఇదిలా ఉంటే మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబరు 3న డికె శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేయగా, ఆయనకు ఈ నెల 13 వరకూ న్యాయస్థానం కస్టడీ విధించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి….https://www.vaartha.com/news/national/