ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూ నారా లోకేష్ ఫైర్ ..

Corona positive to Lokesh
Nara Lokesh

చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ వీరంగం సృష్టించారు. వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిని ఎస్ఐ చితికబాదాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్‌ నియోజకవర్గంలో చిలమత్తూర్ మండలం సంజీవరాయని పేట గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి..దివ్యాంగురాలైన తల్లి పద్మావతికి.. పెన్షన్ ఇవ్వడంలేదని వైసీపీ నేత దామోదరరెడ్డిని వేణు ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు వేణుపై వైసీపీ నేత దామోదరరెడ్డి దాడి చేశారు.

దామోదరరెడ్డి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే.. చిలమత్తూర్ ఎస్‌ఐ బూతులు తిట్టి స్టేషన్‌లోనే వేణుపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందంటూ ఫైరయ్యారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూ ప్రశ్నించారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని.. బాధితుడి తల్లికి పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఘటన రెండు రోజుల క్రితం జరగ్గా… ఈ వీడియో ఇప్పుడు స్ధానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు?(1/3) pic.twitter.com/4ymwWexCP4— Lokesh Nara (@naralokesh) May 1, 2022