‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల జోరు

దేవి థియేటర్ వద్ద 63 అడుగుల నాని కటౌట్ పై పూల వర్షం

‘Shyam Singa Roy’ promotions-

నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో RTC క్రాస్ రోడ్స్ లోని దేవి 70MM ఈ చిత్రానికి మెయిన్ థియేటర్. గడిచిన రెండేళ్లలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న నాని సినిమా ఇదే. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడలలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ ముమ్మరం చేశారు నాని స్వయంగా తమిళనాడు – కేరళ – కర్ణాటక రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లో పాల్గోవటం విశేషం. రెండేళ్ల తర్వాత నాని హీరోగా నటించిన సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులు ఆనందంగా వున్నారు. దేవి థియేటర్ వద్ద 63 అడుగుల భారీ ‘శ్యామ్ సింగరాయ్’ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కటౌట్ ముందు పెద్ద ఎత్తున క్రాకర్లు కాల్చి పూల వర్షం కురిపించారు.

ఎన్నారై వార్తల కోసం: https://www.vaartha.com/news/nri/