శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు హైకోర్టు షాక్‌

మూసివేయాల్సిందిగా తెలంగాణ న్యాయస్థానం ఆదేశాలు

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్: పలు ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కాలేజీలపై తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేసింది. ముఖ్యంగా శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలపై హైకోర్టుసీరియస్ అయ్యింది. వెంటనే 68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్‌ నుంచి కాలేజీలకు ఎలాంటి అనుమతులు లేదా గుర్తింపు లేకుండా శ్రీచైతన్య, నారాయణ సంస్థలు పలు ప్రాంతాల్లో కాలేజీలను ప్రారంభించి అందులో విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చినట్లు తెలంగాణ హై కోర్టు గుర్తించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారణ చేసింది. మార్చి 28 తర్వాత అంటే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/