వకీల్ సాబ్‌ను పట్టించుకోని బ్యూటీ.. ఎందుకో?

వకీల్ సాబ్‌ను పట్టించుకోని బ్యూటీ.. ఎందుకో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించనుండటంతో, ఈ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా వకీల్ సాబ్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగగా, ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. అయితే వకీల్ సాబ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అందాల భామ శృతి హాసన్ మాత్రం సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె వకీల్ సాబ్ చిత్రాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. అయితే ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఏదైనా ప్లాన్ చేశారేమో, అందుకే ఆమె ఈ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదేమో అనే సందేహం చిత్రపురిలో వినిపిస్తోంది.

ఏదేమైనా వకీల్ సాబ్ లాంటి ప్రెస్టీజియస్ మూవీలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్న శృతి హాసన్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇక పవన్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తుండగా, అంజలి, నివేధా థామస్, అనన్యాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.