శ్రేయస్‌ అయ్యర్‌ శతకం.. రాహుల్‌ అర్థ సెంచరీ

Shreyas Iyer
Shreyas Iyer

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. శ్రేయస్‌ అయ్యర్‌ శతకం బాదాడు. 107 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. అయితే సౌథీ వేసిన బంతికి షాట్‌ ఆడబోయి సాంట్నర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అయ్యర్‌ పెవిలియన్‌ చేరాల్సివచ్చింది. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో మొత్తం 103 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 47 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(75), కేదార్‌ జాదవ్‌(13) ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/