శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ లొంగుబాటు

సీఐ నర్సింహారెడ్డి వెల్లడి-

Shravani suicide case
Shravani suicide case-Devaraj surrenders

Hyderabad: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌   ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఈ ఉదయం లొంగిపోయాడని సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.

పోలీసులుఆదేశాల మేరకు కాకినాడ నుంచి దేవరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చి విచారణకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా అతని స్టేట్‌ మెంట్‌ను పోలీసులు రికార్డు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న కాల్‌ రికార్డ్స్‌ను పోలీసులకు సమర్పించనున్నట్లు దేవరాజు తెలిపాడు.

దేవరాజ్‌ను విచారిస్తున్నామని, ఈ కేసులో సాయికృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని సీఐ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/