నిజామాబాద్‌కు తొలి శ్రామిక్‌ రైలు

మహారాష్ట్ర నుండి 1,725 మంది వలస కార్మికులు

migrant-workers

హైదరాబాద్‌: లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తొలి శ్రామిక్‌ రైలు రానుంది. 1,725 మంది వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులతో ముంబయి నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు శ్రామిక్‌ రైలు రానుంది. ఈ రైలులో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 482 మంది కార్మికులు ఉన్నారు. వీరు నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌లో దిగనున్నారు. నారాయణపేట, గద్వాల జిల్లాల వలస కార్మికులు నిజామాబాద్‌లో దిగనున్నారు. నిజామాబాద్‌ నుంచి వీరిని ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు తరలించనున్నారు. మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌, క్వారంటైన్‌ ముద్ర వేయనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/