ఎన్నేళ్లైనా మహిళలకు రక్షణ కరవేనా?

మహిళల జీవితాలను కబళిస్తున్నలైంగిక దాడులు

assaults
Assaults

ప్రపంచదేశాలు కరోనాను మహమ్మారిగా ప్రకటించాయి. కానీ మనదేశంలో మాత్రం అంతకంటే ప్రమాదకరమైన లైంగిక దాడులు మహమ్మారిలా మహిళల జీవితాల్ని కబళిస్తోంది.

ఇందుకు నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో 2019 గణాం కాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నివేదిక ప్రకారం 2018లో భారత దేశంలో మూడు లక్షల ఎనభైవేల మంది మహిళలు వివిధ రకాల హింసకు గురికాగా 2019లో ఆ సంఖ్య నాలుగు లక్షల యాభైవేలకు పెరిగింది.

దీనిలో లైంగిక దాడులు ఎనిమిది శాతం, 32,033మంది బాధితులలో 11శాతం మంది దళి తులు. లైంగిక దాడుల కేసులు గత సంవత్సరం కన్న 7.3 శాతం పెరిగాయి.

ప్రతి లక్షమంది మహిళా జనాభాకు క్రైమ్‌ రేట్‌ 2018లో 58.8 శాతం కాగా, 2019లో 62.4 శాతం. రోజుకు సగటున 8శాతం లైంగికదాడుల కేసులు నమోద య్యాయి. నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

కాని ఇటువంటివి పునరావృతం కాకుండా చూసు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2019 ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం ఎపిలో మహిళలను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి.

దేశం పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే రాష్ట్రం పరిస్థితి కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా,అక్కడి గ్యాంగుల కార్యకలాపాలు ఎపికి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైంది.

ఎపిలో మూడేళ్లుగా మానవ అక్రమ రవాణా క్రమంగా పెరుగుతూ 2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

మహిళలు, మానవ అక్రమరవాణాలో మహారాష్ట్ర 12.5 శాతంతో అగ్రస్థా నంలో ఉండగా10.8శాతంతో ఎంపి తర్వాతి స్థానంలో ఉంది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398 మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురికాగా వారిలో 316 మంది వ్యభిచార గృహాలకు అమ్ముడుపోయారని, వీటికి సంబంధించి కేసుల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సిఆర్‌బి వెల్లడించింది.

ప్రేమించకపోతే అమ్మాయిని చంపేసే హక్కు అబ్బాయిలకు, ప్రేమించి పెండ్లి చేసుకుంటే చంపేసే హక్కు తల్లిదండ్రులకు ఉన్నదని భావించే సమాజం మనది.

‘కేవలం ఆడది కాబట్టే కొడతారు, తిడతారు, ఎదురుతిరిగితే లైంగిక దాడి చేస్తారు. ఇంకా కసి తీరకపోతే చంపేస్తారు. పసిపాపలో కూడా ఆడదాన్నే చూస్తారు.

దళిత మహిళపై లైంగిక దాడిని ఓ సాధనంగా వాడుకుంటున్నారని స్వయంగా నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో వెల్లడించింది.

కంచే చేను మేస్తే పాలకుడే భక్షకుడైతే రక్షణ గాలిల్లో దీపమే అవ్ఞతుంది. రాష్ట్రంలో మానవ మృగాళ్ల దురాగతాలకు అంతేలేకుండాపోతోంది.

ఎన్నికైన వారిలో 70 శాతం మంది నేరస్తులే ఉన్నారు.నేడు మహిళలకు రక్షణ కర వైంది. అర్థరాత్రే కాదు పట్టపగలూ కూడా మహిళలు బయట తిరగలేని పరిస్థితులు వచ్చాయి.

ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి మహిళల వరకూ ఎన్నోవేధింపులకు గురయ్యారు, గుర వుతున్నారు.

2019జూన్‌ నుంచి ఇప్పటి వరకు 230కిపైగా మహిళపైదాడులు జరిగాయంటే అందుకు ప్రభుత్వ చేతకానితనం,వ్యవస్థల వైఫల్యమే కారణం.రూపందాల్చని దిశ చట్టంపై నేతలంతా గొప్పలు చెప్పారు.

13 జిల్లాల్లోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెడతామని ఊదరగొట్టారు. కోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం నేటికీ పేపర్‌ వర్క్‌ చేయలేదు.

ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్‌ ల్యాబ్స్‌పెట్టి 176 పోస్టులు భర్తీచేస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారు.

13 జిల్లాల్లోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెడతామని ఊదరగొట్టారు. కోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం నేటికీ పేపర్‌ వర్క్‌ చేయలేదు. ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్‌ ల్యాబ్స్‌పెట్టి 176 పోస్టులు భర్తీచేస్తామని ప్రకటనల క పరిమితమయ్యారు.

తెలంగాణాలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాతదేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఎపి ప్రభుత్వం ఎపి దిశ బిల్లు 2019ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది.

మహిళలపై తీవ్రమైన దాడుల ఘటనల్లో సరైన సాక్ష్యాలుంటే 21 రోజు ల్లోనే నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఎపి ప్రభుత్వం రూపొం దించిదని అధికారపక్షం నాయకులు హడావుడి చేసి చట్టంరూపం దాల్చకముందే పోలీసు స్టేషన్లు పెట్టారు.

తీరా దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండా వెనక్కిపంపేసరికి దానిఊసేలేకుండా చేశారు.

మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు. అది సామాజిక బాధ్యత.ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి.

ఓవైపు అభివృద్ధి,సంక్షేమరంగాల్లో ముందున్నామంటూచంకలు గుద్దుకుంటున్న నేతలకు మహిళపై జరుగుతున్న అఘాయిత్యా లు కనిపించడంలేదు.

మహిళలపై జరుగుతున్నలైంగికదాడులు, వేధింపులు అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసిన సందర్భాలే లేక పోవడం శోచనీయం.

నానాటికీ పెరిగి పోతున్న ఈ దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకు వచ్చిన చట్టాలు ఎంతవరకు పనిచేస్తున్నాయంటూ మహిళా లోకం ప్రశ్నిస్తోంది.

సమాజంలో వస్తున్న విప్లవాత్మకమార్పుల్లో భాగంగా సాంకేతిక వస్తువు లు,సాధనాల వాడకం విస్తృతంగా పెరిగిపోయింది.

ఈ పరిజ్ఞ్ఞానం సమాజ అభివృద్ధికిమాత్రమే ఉపయోగపడాల్సి ఉండగా అలా జరకగపోవడం విచారకరం. ప్రధానంగా ప్రసారమాధ్యమాలలో ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి.

స్త్రీ పట్ల ప్రతిఒక్కరికీ గౌరవ ప్రధమైన భావాలు కలిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందిపోయి అధికారులు,రాజకీయ నాయకులకుతలొగ్గి వారిని రక్షించడానికే కొందరు పనిచేస్తున్నారు.

చట్టాలను పక డ్బందీగా అమలుచేసి తగినచర్యలు తీసు కోవాలి.మహిళలు, చిన్నారులపైదాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తే దాడులు మరోసారి పునారవృతం కాకుండా ఉంటాయి.

  • ఈడిగ సుకన్యాదేవి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/